ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ మృతిపై సంచలన వాస్తవం వెల్లడించిన భార్య

12-08-2024 Mon 22:01 | Sports
Advertisement
  • ఇటీవల ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహమ్ థోర్ప్ కన్నుమూత
  • అనారోగ్యంతో మరణించినట్టు వార్తలు
  • ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన భార్య అమందా
Advertisement
ఇటీవల ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గ్రాహమ్ థోర్ప్ నడివయసులోనే కన్నుమూయడం క్రికెట్ వర్గాలను తీవ్ర విషాదానికి గురిచేసింది. థోర్ప్ వయసు 55 సంవత్సరాలు. ఈ లెఫ్ట్ హ్యాండర్ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందినట్టు ఇటీవల ఓ ప్రకటన వెలువడింది. 

అయితే, థోర్ప్ భార్య అమందా ఓ ఇంటర్వ్యూలో సంచలన వాస్తవం వెల్లడించారు. తన భర్త థోర్ప్ ది సహజ మరణం కాదని, థోర్ప్ బలవన్మరణం చెందాడని స్పష్టం చేశారు. థోర్ప్ గత రెండేళ్లుగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడని, అనారోగ్య సమస్యలతో మానసికంగా కుంగిపోయి రెండేళ్ల కిందట కూడా ఆత్మహత్యాయత్నం చేశాడని అమందా వివరించారు. 

అప్పట్లో పరిస్థితి విషమించడంతో చాలాకాలం పాటు థోర్ప్ ఐసీయూలో ఉండాల్సి వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత కొద్దిగా కోలుకున్నట్టు  అనిపించినా, మళ్లీ డిప్రెషన్ లోకి జారుకున్నాడని, మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఈసారి అతడిని కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగా, థోర్ప్ ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని ఆయన కుమార్తె కిట్టీ కూడా నిర్ధారించింది. తమను ఎంతో ప్రేమించి తండ్రి ఇలా చేసుకోవడం అత్యంత బాధాకరమని పేర్కొంది.
Advertisement
Graham ThorpeDeathAmandaEngland

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more